ప్రొద్దటూరుకు చెందిన షణ్ముఖ రెడ్డి గారు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా కడప జిల్లా ప్రజలతో కలిసి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. కేవలం ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాక, వాటి పరిష్కార మార్గాలను కూడా అన్వేషించి, ఒక ప్రణాళిక ప్రకారం కడప జిల్లా అభివృద్ధి కోసం ఒక విజన్ తో కొన్ని లక్ష్యాలను నిర్ధేశించుకొని, వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్లే విధం గా ముందుకు వెళ్తున్నారు.
తాజాగా ఎన్నికల పోటీ లో నిలబడటానికి, కడప ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాకర్ల షణ్ముఖ రెడ్డి గారు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయం లో జిల్లా ఎన్నికల అధికారి విజయ రామరాజుకు నామినేషన్ పత్రాలను అందించారు. తనకు ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.